22వ సర్గ
కఠినమైన సీత పలుకులను
మృదుభాషణగ వినిన వాడై
అందుకు ప్రతిగా సీతను చూచుచు
రావణుడీవిధి తెలుప సాగెను
"నీపై నా ఈ అమిత మోహము
గుర్రము అదుపున పెట్టెడి సారధి లాగ
నీవు పలికిన పరుష వాక్కులతొ
నాలో రేగిన క్రోధమును దించెను
వనమున తిరిగెడి రాముని పైనా
మనమును నిల్పి నను కాదనెడి
నీకు నీపై రేగిన ప్రేమే శరణు."
క్రోధము పెరిగి కన్నుల నిప్పులు క్రక్కుచు
సీతను చూస్తూ రావణుడిట్లనె
రెండు మాసములె గడువిక నీకు
అంతలొ భర్తగ నన్ను పొందుము
లేనిచొ చావుకు సిద్ధముగమ్ము
రెండు నెలలలో నాదానిగ నిలువుము
లేనిచొ నాకు విందు కాగలవు. 9
భయమున వణికెడి సీతను చూసి
జాలిని చూపిరి గంధర్వాంగలు
తనపై జాలిని చూపిన వారిని చూసి
ధైర్యము కొద్దిగ కూడగట్టుకుని
రావణుని తొ ఈవిధి చెప్పతొడగెను
"నీ క్రూర కర్మలను తెలిసిన ఎవ్వరు
నీ పై జాలిని చూపగ రారు
రాముని శక్తిని తెలిసిన ఎవరు
నను కంటితొనైనా చూడగలేరు
అటువంటి నన్ను ఇక్కడకు తెచ్చి
ఇచ్చపురీతిన పలికితివీవు
కాలము నీకు దాపురించినదు
ఎక్కడకెల్లిన నీ ప్రాణము దక్కదు.
పరుష పలుకుల నాలుక ముక్కలగును
కామమున చూసిన కన్నులు రాలగలవు
పాపము చేసి రాముని వేటవితివి
లేనిచో ఇక్కడే భస్మము చేసెద
నన్నిట తెఛ్ఛిన నీకు మరణము తధ్యము"
కఠిన మాన సీత మాటలు విని
కృఓధముతో కన్నులు ఎర్రగ కాగ
నల్లలి మేఘము లాగ తనువును కదుపుచు
శింహము వంటి నిశితమగు కన్నులు కల్గి
ధరించిన మేలిమి బంగరు గొలుసులు మ్రోగగ
మందరగిరిని బ్రోలిన భుజములు కల్గి
వివిధ ఆభరణములతొ అల్న్కాంకృతమయ్యు
పూలు అమరిన సమాధి వలె గనపడె
నిప్పులు గ్రక్కెడి కన్నులు త్రిప్పుచు
సీతతొ రావణుడిట్లు పలికెను
"చీక్టిని నాశము చేసెడి సూర్యుని లాగా
రాముని తోడుగ నిన్నును చంపెద"
అక్కడ నిల్చిన వ్కృతరూపుల నుద్దెసించి
"సీత నాకు లొంగే విధముగ
ఆమెకు త్వరగ శిక్షణ నివ్వుము
నయముననైన భయముననైన
బ్రతిమాలైన బహుమతులనైన
సీను నాకు లొంగె విధముగ
సిక్షణ ఆమెకు తప్పక నివ్వుం"
కోపము కామము కన్నుల నిండగ
కర్కశ ఆజ్ఞలు రావణుడిచ్చెను.
ధన్యమాలినను రాక్షశి వచ్చి
రావణునుద్దెసించి ఈవిధి పలికెను
"తిండి తిప్పలు ఎప్పుడో విడిచి
జీవము జచ్చిన మానవి సీత
ఈమెకు శుఖములు పొందే భాగ్యము
బ్రహ్మ నుదుటిపై రాయుట మరిచెను
ఈమెను వదిలి నాతో గడుపుము
నిన్నుగోరెడి వనితలె నీకు
ఎక్కడలేని సుఖముల నుత్తురు"
అట్లుపలికెడి వనిత తోడుగ
అక్కడ చేరిన గంధర్వాంగనల తోడుగ
క్రోధము నిండిన ఎర్రని కన్నుల తోడుగ
వొంటరిగ, భయమున వణుకుతు
అశోకవనమును, సీతను వదిలి
తమ భవనముల వైపుకు మరలిరి. 46
Tuesday, April 22, 2008
Subscribe to:
Posts (Atom)